సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం బాధ్యతలు
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:31 AM
కొత్తగా ఎన్నికైన ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం గురువారం బాధ్యతలు స్వీకరించింది.
నూతన కమిటీకి అప్సా అధ్యక్షుడు రామకృష్ణ అభినందనలు
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కొత్తగా ఎన్నికైన ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం గురువారం బాధ్యతలు స్వీకరించింది. అమరావతి సచివాలయంలోని మూడవ బ్లాకులో సంఘం నూతన అధ్యక్షురాలు టి.దుర్గతోపాటు కార్యవర్గం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి నాపా ప్రసాద్, ఉపాధ్యక్షులు పవన్, లక్ష్మణకుమారి తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.