Share News

ఎస్‌ఈసీ నియామకాన్ని పూర్తి చేశాం

ABN , Publish Date - May 01 , 2026 | 04:31 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియామకం పూర్తయిందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. బీసీల సామాజిక స్థితిగతులపై...

ఎస్‌ఈసీ నియామకాన్ని పూర్తి చేశాం

  • బీసీల స్థితిగతులపై సర్వే: ఏజీ.. హైకోర్టు విచారణ జూలైకి వాయిదా

అమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియామకం పూర్తయిందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. బీసీల సామాజిక స్థితిగతులపై జరుపుతున్న సర్వే పూర్తయ్యేందుకు మరో నెల సమయం పట్టవచ్చని.. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సర్వే వివరాల ప్రాతిపదిన స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌ను ఏకసభ్య కమిషన్‌ నిర్ణయిస్తుందన్నారు. వేసవి సెలవుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టంచేశారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణను జూలై మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - May 01 , 2026 | 04:31 AM