Share News

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు స్క్రీనింగ్

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:32 AM

రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రశక్త్‌ యాప్‌ 2.0 ద్వారా స్క్రీనింగ్ చేయనున్నట్లు సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు స్క్రీనింగ్

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రశక్త్‌ యాప్‌ 2.0 ద్వారా స్క్రీనింగ్ చేయనున్నట్లు సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన ప్రోద్బలం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఈ యాప్‌ అన్ని పాఠశాలల యూడైస్‌ కోడ్‌తో అనుసంధానం అయ్యిందని, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని స్ర్కీనింగ్‌ నిర్వహించాలని సూచించారు. వంద శాతం పిల్లలకు స్ర్కీనింగ్‌ జరగాలని స్పష్టంచేశారు.

Updated Date - Jun 18 , 2026 | 04:34 AM