Share News

ఏఐ కాన్‌క్లేవ్‌లో ‘ఏపీ పాఠశాల విద్య’ స్టాల్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:26 AM

ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఏఐ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేసింది.

ఏఐ కాన్‌క్లేవ్‌లో ‘ఏపీ పాఠశాల విద్య’ స్టాల్‌

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఏఐ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌ గురువారం ఏపీ స్టాల్‌ను సందర్శించారు. రాష్ట్రం నుంచి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు రాష్ట్రంలో అమలుచేస్తున్న విద్యా విధానాలు, సంస్కరణల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. పాల్‌ ల్యాబ్స్‌, మధ్యాహ్న భోజనపథకం అమలు, క్లిక్కర్‌లు, గ్యారెంటీడ్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌, చాట్‌బోట్‌ల గురించి తెలియజేశారు. ఏపీ సాంకేతిక వినియోగాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. త్వరలో రాష్ర్టాన్ని సందర్శిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Feb 13 , 2026 | 04:26 AM