Share News

ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌ జెండా ఆవిష్కరించాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:19 AM

పాఠశాలల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు.

ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌ జెండా ఆవిష్కరించాలి

  • పాఠశాలల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ఆదేశాలు

అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. జిల్లా స్థాయిలో డీఈవోలు, పాఠశాల స్థాయిలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించేలా కార్యక్రమం నిర్వహించాలని స్పష్టంచేశారు. చైర్మన్‌ లేకపోతే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఆవిష్కరించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, క్విజ్‌లు కూడా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను స్వాతంత్ర దినోత్సవానికి ఆహ్వానించాలని సూచించారు.

Updated Date - Aug 05 , 2026 | 03:22 AM