ఎస్సీల సమస్యల పరిష్కారమే కమిషన్ లక్ష్యం
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:27 AM
షెడ్యూల్డ్ కులాల ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల...
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదన: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్
నంద్యాల నూనెపల్లి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ కులాల ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ పర్యటిస్తోందని చైర్మన్ కేఎస్ జవహర్ తెలిపారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లో కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, సభ్యులు పాల్గొని వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొత్తం 53 అట్రాసిటీ కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 11 కేసులు పరిష్కారమైనట్టు తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా, నిందితులకు సకాలంలో శిక్ష పడేలా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి ప్రతిపాదన పంపుతున్నట్టు వెల్లడించారు.