AP Sandalwood: ఏపీ ఎర్రచందనం రైతులకు 45 లక్షలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:25 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.45 లక్షలు విడుదల చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.45 లక్షలు విడుదల చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ(ఎన్‌బీఏ) ‘యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ఏబీఎస్)’ విధానం కింద రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం రైతులకు ఈ మొత్తాన్ని విడుదల చేసింది. ఏపీ జీవ వైవిధ్య మండలి ద్వారా ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. ఎన్‌బీఏ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లను విడుదల చేయగా.. ఇందులో రూ.104 కోట్లు ఏపీకే కేటాయించడం గమనార్హం.