Share News

దివ్యాంగుల పథకాల అమలుకు రూ.3.99 కోట్లు

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:56 AM

రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్ధులకు అందిస్తున్న సహాయక పరికరాలు, ఉపకరణాలు, మోటరైజ్డ్‌ త్రిచక్ర వాహనాల పథకాల అమలుకు ప్రభుత్వం..

దివ్యాంగుల పథకాల అమలుకు రూ.3.99 కోట్లు

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్ధులకు అందిస్తున్న సహాయక పరికరాలు, ఉపకరణాలు, మోటరైజ్డ్‌ త్రిచక్ర వాహనాల పథకాల అమలుకు ప్రభుత్వం రూ.3 కోట్ల 99 లక్షల 56 వేలు నిధులను మంజూరు చేసింది. గురువారం ఈ మేరకు మహిళా,శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 20 , 2026 | 04:57 AM