వైసీపీ నేతలు క్షమాపణ చెప్పి.. చెంపలేసుకోవాలి
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:53 AM
వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు ధరించి శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాలతో అపచారానికి పాల్పడడం అత్యంత బాధాకరమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు..
ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద
డాబాగార్డెన్స్(విశాఖపట్నం), ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు ధరించి శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాలతో అపచారానికి పాల్పడడం అత్యంత బాధాకరమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో శ్రీవారి పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ చిత్తు కాగితాలుగా కిందకు, పైకి వేయడం హేయమన్నారు. మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే తప్పుచేస్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. త్వరలోనే రాష్ట్రంలోని సాధువులతో ఈ విషయమై విజయవాడలో సమావేశం నిర్వహిస్తామని శ్రీనివాసానంద ప్రకటించారు.