Share News

గ్రామీణ మహిళలకు 1.28లక్షల కోట్ల లబ్ధి

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:00 AM

రాష్ట్రంలో గ్రామీణ మహిళలకు 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు రూ.1.28లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్లు సెర్ఫ్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

గ్రామీణ మహిళలకు 1.28లక్షల కోట్ల లబ్ధి

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో గ్రామీణ మహిళలకు 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు రూ.1.28లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్లు సెర్ఫ్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్తూ, బ్యాంక్‌ లింకేజీ ద్వారా 5.99లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.71.307కోట్లు, ఉన్నతి పథకం కింద 88,655 మందికి రూ.540కోట్లు, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ కింద 37.59లక్షల మందికి రూ.40,084కోట్లు, స్త్రీనిధి బ్యాంకు కింద రూ.16.70లక్షల మందికి రూ.13,116కోట్లు, సీవీఎఫ్‌ కింద రూ.1.25లక్షల మందికి రూ.641కోట్లు, ఎంటర్‌ ప్రైజ్‌ ఫైనాన్స్‌ కింద లక్షా 3వేల మందికి రూ.2,887కోట్లు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

Updated Date - Aug 21 , 2026 | 05:01 AM