Share News

గ్రామీణ రోడ్లకు చెందిన ఆరు ఖాతాల మూసివేత

ABN , Publish Date - Aug 15 , 2026 | 05:05 AM

రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్‌డీపీ) కింద గ్రామీణ రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్న ఆరు హెడ్‌ ఆఫ్‌ అకౌంట్లను మూసివేశారు.

గ్రామీణ రోడ్లకు చెందిన ఆరు ఖాతాల మూసివేత

  • పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు మూడు ఖాతాల కొనసాగింపు

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్‌డీపీ) కింద గ్రామీణ రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్న ఆరు హెడ్‌ ఆఫ్‌ అకౌంట్లను మూసివేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయా ఖాతాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటికీ కొనసాగుతున్న లేదా పూర్తయిన పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న మరో 3 ఖాతాల నుంచి పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ను ఆదేశించింది.

Updated Date - Aug 15 , 2026 | 05:06 AM