Share News

విద్యాహక్కు చట్టంపై విస్తృత ప్రచారం: లోకేశ్‌

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:58 AM

విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు.

విద్యాహక్కు చట్టంపై విస్తృత ప్రచారం: లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. గురువారం శాసన మండలిలో విద్యాహక్కు చట్టంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, 2022-23 నుంచి 2026-27 వరకు ఆర్టీఈ కింద 1,04,056 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పారు. 2022-23లో 2,203 మందే చేరగా, 2024-25లో 29వేల మంది చేరారని చెప్పారు. 2026-27లో 28,742 మందికి అడ్మిషన్లు లభించాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా హక్కు చట్టంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Aug 21 , 2026 | 04:59 AM