ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - May 02 , 2026 | 03:51 AM
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం చాన్సలర్ మధుమూర్తి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
వేంపల్లె, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం చాన్సలర్ మధుమూర్తి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో ఆరు సంవత్సరాల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 4,400 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది 10వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు నాలుగు మార్కుల వెయిటేజీతో మెరిట్ జాబితాను తయారు చేయనున్నారు. మే 30వ తేదీ వరకు ఆర్జీయూకేటీ వెబ్‌సైట్, ఏపీ ఆన్‌లైన్ మీసేవల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన మెరిట్ జాబితాను తయారు చేసి జూన్ 12న లిస్టు ప్రకటించనున్నామని అడ్మిషన్ కన్వీనర్ అమరేంద్రకుమార్ సండ్ర తెలిపారు. జూన్ ఆఖరుకు అడ్మిషన్లు కల్పించి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.