Share News

ఘనవ్యర్థాలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై సమీక్ష

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:03 AM

మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియామాలు-2026, స్వచ్ఛ సర్వేక్షణ 2025-26పై గురువారం విజయవాడలో...

ఘనవ్యర్థాలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై సమీక్ష

  • ఆస్తి పన్ను వసూళ్ల ప్రగతిపై కమిషన్లకు అభినందనలు

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియామాలు-2026, స్వచ్ఛ సర్వేక్షణ 2025-26పై గురువారం విజయవాడలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు, పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 123 మంది మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజనీర్లు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురే్‌షకుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఉదయం మున్సిపల్‌ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలపై చర్చ జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. పట్టణ పాలనలో ఆస్తి పన్ను వసూళ్లు, డిజిటల్‌ సేవలు, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుధ్యం, రోడ్డు భద్రత, కాలువలు శుభ్రపరిచే పనులపై సమీక్ష నిర్వహించారు. ఆస్తి పన్నుల వసూళ్లలో మెరుగైన పనితీరు కనబరచిన పలు పట్టణ స్థానికసంస్థల కమిషనర్లను సత్కరించారు. అత్యధిక వసూళ్లు చేసిన గ్రేట్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌, తాడిపత్రి, వినుకొండ మున్సిపాలిటీల కమిషనర్లను అభినందించారు.

Updated Date - Apr 24 , 2026 | 05:03 AM