బీపీసీఎల్‌కు 6,042 ఎకరాలు మ్యుటేషన్
ABN , Publish Date - May 16 , 2026 | 04:49 AM
నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు పరిధిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేటాయించిన 6,042 ఎకరాల భూమిని...
సీసీఎల్‌ఏ, నెల్లూరు, ప్రకాశం కలెక్టర్లు తక్షణ చర్యలు తీసుకోవాలి
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశాలు
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు పరిధిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేటాయించిన 6,042 ఎకరాల భూమిని ఆ సంస్థ పేరిటే మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. దీనిపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు తక్షణం చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని చెవ్వూరు, రావూరు, నెల్లూరు జిల్లా కావలి మండలంలోని చెన్నాయపాలెం, రుద్రకోట గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములు మొత్తం 6,042 ఎకరాలు బీపీసీఎల్‌కు ప్రభుత్వం కేటాయించింది.