Share News

నెల్లూరు, కర్నూలుల్లో సీబీజీ ప్లాంట్లు

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:33 AM

పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్లకు ఆమోదం తెలిపింది.

నెల్లూరు, కర్నూలుల్లో సీబీజీ ప్లాంట్లు

  • కర్నూలు, విజయనగరంలో సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు

  • ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్లకు ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా ఏఎ్‌సపేట మండలంలో 20 టన్స్‌ పర్‌ డే (టీపీడీ) సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో 20 టీపీడీ సామర్థ్యంతో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా కర్నూలు జిల్లా కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో 200, 80 మెగావాట్ల సామర్థ్యంతో విండ్‌, సోలార్‌ పవర్‌తో కూడిన రెండు భారీ హైబ్రిడ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అటు విజయనగరం జిల్లా గుర్ల మండలంలోనూ 80 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.

Updated Date - Aug 22 , 2026 | 04:35 AM