డిస్కంలకు 4802 కోట్ల అడ్వాన్స్ టారిఫ్ సబ్సిడీ
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:59 AM
విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి అడ్వాన్స్...
విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి అడ్వాన్స్ టారిఫ్ సబ్సిడీ కింద రూ.4802.70 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్‌కు రూ.1925.29 కోట్లు, ఎస్పీడీసీఎల్‌కు రూ.1722.30 కోట్లు, ఈపీడీసీఎల్‌కు రూ.1155.11 కోట్లు చెల్లించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.13,888.03 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో తొలి విడతగా రూ.4802.70 కోట్లు విడుదల చేశారు.