Share News

ఫీజు బకాయిలు రూ.1,198 కోట్లు విడుదల

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:45 AM

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 2024-25 విద్యా సంవత్సరానికి బకాయిలు ఉన్న రూ.1,198 కోట్ల విడుదలకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లపై మంగళవారం...

ఫీజు బకాయిలు రూ.1,198 కోట్లు విడుదల

  • 2024-25 విద్యాసంవత్సరానికి చెల్లింపు

  • నేడు ప్రైవేటు వర్సిటీలకు ప్రత్యేక జీవో?

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 2024-25 విద్యా సంవత్సరానికి బకాయిలు ఉన్న రూ.1,198 కోట్ల విడుదలకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లపై మంగళవారం వేర్వేరు జీవోలు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.258 కోట్లు, రూ.477 కోట్లు, ఈడబ్ల్యూఎస్‌ శాఖ నుంచి రూ.365 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖ నుంచి రూ.98 కోట్ల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గత సంవత్సర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు మొత్తం క్లియర్‌ అవుతాయి. ఈ ఫీజులన్నీ నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ అవుతాయి. ఇంకా 2023-24 విద్యా సంవత్సరంలో రూ.1,500 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి. వాటిని ఎవరికి ఇవ్వాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. సూత్రప్రాయంగా తల్లుల ఖతాల్లోనే జమ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలా అయితే కోర్సులు పూర్తిచేసుకుని వెళ్లిపోయిన వారినుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా, 2025-26లో మూడు త్రైమాసికాలకు రూ.1,800 కోట్లు ఫీజులు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ప్రైవేటు వర్సిటీల కన్వీనర్‌ కోటా విద్యార్థులకు ఫీజుల విడుదల కోసం ఉన్నత విద్యాశాఖ నేడు విడిగా జీవో జారీచేసే అవకాశం ఉంది.

Updated Date - Feb 11 , 2026 | 03:45 AM