Share News

పీఎంఎఫ్ఎంఈ పథకం కింద ఏపీకి 137 కోట్ల సబ్సిడీ

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:53 AM

సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎంఎఫ్ఎంఈ కింద చిన్న వ్యాపారాలకు మద్దతు లభిస్తున్నట్లు...

పీఎంఎఫ్ఎంఈ పథకం కింద ఏపీకి 137 కోట్ల సబ్సిడీ

న్యూఢిల్లీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎంఎఫ్ఎంఈ కింద చిన్న వ్యాపారాలకు మద్దతు లభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, బీకే పార్థసారథి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిట్టు సమాధానమిచ్చారు. పథకం ప్రారంభం నుంచి రూ.5,009.61 కోట్ల సబ్సిడీ ఇవ్వగా.. ఇందులో ఏపీకి 137.81 కోట్ల సబ్సిడీ మంజూరైనట్లు తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 04:53 AM