Share News

రాజ్యసభ ఎంపీ నామినేషన్ల ఆమోదం

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:12 AM

రాజ్యసభ ఎంపీ ఎన్నికలకు సంబంధించి నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్‌.వనితా రాణి వెల్లడించారు.

రాజ్యసభ ఎంపీ నామినేషన్ల ఆమోదం

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ ఎంపీ ఎన్నికలకు సంబంధించి నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్‌.వనితా రాణి వెల్లడించారు. మంగళవారం అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ తరఫున చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌, జనసేన తరఫున లింగమనేని రమేశ్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. పరిశీలన కార్యక్రమంలో ఆయా అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 05:14 AM