రిబేట్‌తో పెరిగిన ఆస్తి పన్ను వసూళ్లు
ABN , Publish Date - May 02 , 2026 | 03:54 AM
గ్రామ పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన రిబేట్ సత్ఫలితాలనిస్తోంది.
పంచాయతీలకు ఒకే రోజు రూ.10 కోట్లు చెల్లించిన సంస్థలు
సత్ఫలితాలిచ్చిన ఎర్లీ బర్డ్ ఆఫర్
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన రిబేట్ సత్ఫలితాలనిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మే నెలలోపు చెల్లిస్తే 5శాతం రిబేట్ ఇస్తామంటూ పంచాయతీరాజ్ శాఖ ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రకటించింది. దీంతో పన్ను చెల్లించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. మే 1న ఒక్కరోజే సుమారు రూ.10 కోట్ల మేర ఆస్తి పన్ను చెల్లించారు. తిరుపతిలో లెమన్ ట్రీ హోటల్, అమరావతిలో విట్ కళాశాల యాజమాన్యంతోపాటు పలు సంస్థలు ముందుగానే పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఆన్‌లైన్‌లో సుమారు రూ.3 కోట్లకుపైగా చెల్లింపులు చేయగా, మరో రూ.7 కోట్లకు సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపులు డీడీ రూపంలో శాఖ కమిషనర్ కృష్ణతేజకు అందించారు. రిబేట్ తో పన్నులు ముందుగానే వసూలు అవుతుండటం శుభపరిణామమని అధికారులు పేర్కొంటున్నారు.