ప్రైవేటు పాఠశాలల సంఘానికి నూతన కార్యవర్గం
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:26 AM
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల నిర్వాహకుల సంఘం చైర్మన్‌గా అన్వర్‌బాషా (నెల్లూరు), రాష్ట్ర అధ్యక్షునిగా పర్వతరెడ్డి కిశోర్‌బాబు (ప్రకాశం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహారాణిపేట (విశాఖపట్నం), ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల నిర్వాహకుల సంఘం చైర్మన్‌గా అన్వర్‌బాషా (నెల్లూరు), రాష్ట్ర అధ్యక్షునిగా పర్వతరెడ్డి కిశోర్‌బాబు (ప్రకాశం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖపట్నం వన్‌టౌన్‌లోని సంఘం కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బి.వి.మురళీమనోహర్ (విశాఖపట్నం), అదనపు కార్యదర్శిగా గోపాలరెడ్డి (కడప), కోశాధికారిగా మల్లాడి రాజా (తూర్పు గోదావరి)ను ఎన్నుకున్నారు. అలాగే ప్రతి జిల్లా నుంచి ఒక ఉపాధ్యక్షుడిని, ఒక సహాయ కార్యదర్శిని ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గ సభ్యులు సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్నారు.