Share News

నిరంతర విద్యుత్తు సరఫరానే లక్ష్యం

ABN , Publish Date - May 07 , 2026 | 03:50 AM

వేసవి కాలం పూర్తయ్యే వరకు ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్తు సరఫరా అందించడమే మన లక్ష్యం కావాలని సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి అన్నారు.

నిరంతర విద్యుత్తు సరఫరానే లక్ష్యం

  • సీపీడీసీఎల్‌ పరిధిలోని ఎస్‌ఈలతో సీఎండీ సమీక్ష

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): వేసవి కాలం పూర్తయ్యే వరకు ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్తు సరఫరా అందించడమే మన లక్ష్యం కావాలని సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి అన్నారు. సీపీడీసీఎల్‌ పరిధిలోని ఎస్‌ఈలతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు త్వరితగతిన సర్వీసులు ఇవ్వాలని, రెవెన్యూ కలెక్షన్లు నూరు శాతం సాధించాలని, లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలని, ఫీడర్స్‌ అన్నీ బ్రేక్‌ డౌన్‌ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సరైన సమయానికి బిల్లింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. నూతనంగా నిర్మించనున్న సబ్‌స్టేషన్ల నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. విద్యుత్తుసేవలపై ప్రజాభిప్రాయ సానుకూలత 90 శాతం కన్నా ఎక్కువ ఉండాలన్నారు. సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్‌, టీవీఎ్‌సఎన్‌ మూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 03:50 AM