విద్యుత్ శాఖలో కొలువులు
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:29 AM
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్...
629 ఏఈఈలకు నోటిఫికేషన్
3 డిస్కంల పరిధిలో పోస్టులు
2019లో చివరిసారిగా నోటిఫికేషన్
తిరిగి కూటమి హయాంలోనే మళ్లీ
అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. సుమారు 629 ఏఈఈ పోస్టులకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాన్స్‌కో పరిధిలో 200, జెన్‌కో పరిధిలో 100, ఎస్పీడీసీఎల్ పరిధిలో 134, సీపీడీసీఎల్ పరిధిలో 60, ఈపీడీసీఎల్ పరిధిలో 135 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఈఈ పోస్టులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 మార్చిలో చివరిగా నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ 7 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ రావడంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా విద్యుత్‌శాఖలో సిబ్బంది కొరతను తీర్చడంలో ఇది తొలి అడుగని ఆ శాఖ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాస్, బహుజన విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీఎం రవిశంకర్ పేర్కొన్నారు. కాగా, 629 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అటు నిరుద్యోగులకు మేలు చేయడంతోపాటు ఇటు శాఖలో సిబ్బంది కొరతను అధిగమించగలుగుతామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. పోస్టులు ఇవీ..
ఏపీ ట్రాన్స్‌కో: ఏఈఈ(ఎలక్ట్రికల్) 167, ఏఈఈ(సివిల్) 23, ఏఈఈ(టెలికం) 10
ఏపీ జెన్‌కో: ఏఈఈ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలకా్ట్రనిక్స్) 80, ఏఈఈ(సివిల్) 20
ఏపీఎస్పీడీసీఎల్: ఏఈఈ(ఎలక్ట్రికల్) 124, ఏఈఈ(సివిల్) 6, ఏఈఈ(టెలికం) 4
ఏపీసీపీడీసీఎల్: ఏఈఈ(ఎలక్ట్రికల్) 56, ఏఈఈ(సివిల్) 3, ఏఈఈ(టెలికం) 1
ఏపీఈపీడీసీఎల్: ఏఈఈ(ఎలక్ట్రికల్) 128, ఏఈఈ(సివిల్) 4, ఏఈఈ(టెలికం) 3