Share News

ఏప్రిల్‌ 25న పాలీసెట్‌.. 73 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:52 AM

వచ్చే విద్యా సంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 25న పాలీసెట్‌ నిర్వహించనున్నట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ తెలిపింది.

ఏప్రిల్‌ 25న పాలీసెట్‌.. 73 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 25న పాలీసెట్‌ నిర్వహించనున్నట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ తెలిపింది. పాలీసెట్‌-2026 నిర్వహణ ఏర్పాట్లపై గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. 73 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఇందుకోసం పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు దీనిపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యం అయ్యే 10వేల మందికి వసతి సౌకర్యం కల్పించాలని నిర్దేశించింది. టెన్త్‌ విద్యార్థుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ను ఆదేశించింది.

Updated Date - Feb 27 , 2026 | 03:54 AM