Share News

ఆలిండియా పోలీస్‌ టీటీలో ‘ఈగల్‌’ సత్తా

ABN , Publish Date - May 15 , 2026 | 04:58 AM

జాతీయస్థాయి పోలీస్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ ‘ఈగల్‌’ పోలీసు జట్టు మొదటిసారి పతకాలు సాధించింది.

ఆలిండియా పోలీస్‌ టీటీలో ‘ఈగల్‌’ సత్తా

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి పోలీస్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ ‘ఈగల్‌’ పోలీసు జట్టు మొదటిసారి పతకాలు సాధించింది. ఈ నెల 9నుంచి 13వరకూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఆలిండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌ క్లస్టర్‌ 2025-26 టోర్నమెంట్లో ఏపీ పోలీసు శాఖ రెండు పతకాలు సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్‌ విభాగంలో ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ, ఏఎస్పీ స్వరూపారాణి జోడీ, మహిళల డబుల్స్‌ విభాగంలో అప్పా ఎస్పీ శోభామంజరి, ఏఎస్పీ స్వరూపారాణి జోడీ కాంస్య పతకాలను సాధించింది. వారికి డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా అభినందనలు తెలిపారు.

Updated Date - May 15 , 2026 | 04:58 AM