నగర వనాల్లో జీవ వైవిధ్య పార్కులు
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:18 AM
పట్టణాల్లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు పలు చర్యలు తీసుకునేందుకు బయోడైవర్సిటీ బోర్డు నిర్ణయించింది. బుధవారం విజయవాడలో.
బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్
అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు పలు చర్యలు తీసుకునేందుకు బయోడైవర్సిటీ బోర్డు నిర్ణయించింది. బుధవారం విజయవాడలో బోర్డు సమావేశం జరిగింది. అందులో సమగ్ర ప్రణాళికను బోర్డు ఖరారు చేసిందని చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్, సభ్య కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ‘‘పట్టణాల్లో రద్దీగా ఉండే కూడళ్లల్లో సూక్ష అడవుల అభివృద్ధిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, ఇప్పటికే ఉన్న నగరవనాల్లో చిన్న జీవ వైవిధ్య పార్కులు ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. కడపలో జీవ వైవిధ్య పార్కు మొదటిదశ పూర్తి కావొస్తోంది. దీన్ని సెప్టెంబరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. మంగళగిరి, తిరుపతిలో కొత్త పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం’ అని నీలాయపాలెం వివరించారు.