రాష్ట్రంలో 50 ‘భవ్య’ పార్కులు: టీజీ భరత్
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:44 AM
కేంద్ర ప్రభుత్వ పథకం భారత ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) కింద రాష్ట్రంలో 50 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని..
ఇంటర్నెట్ డెస్క్:కేంద్ర ప్రభుత్వ పథకం భారత ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) కింద రాష్ట్రంలో 50 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తొలివిడతలో 20 పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా.. ఇందులో 6 పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు వివరించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కెమికల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.