20 ప్రాంతాల్లో లేబర్ అడ్డాలు
ABN , Publish Date - May 30 , 2026 | 05:42 AM
రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటేడ్ ల్యాబ్ ఎమినిటీస్ కాంప్లెక్స్)లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీపీపీ పద్ధతిలో నిర్వహణకు కార్మికశాఖ ఉత్తర్వులు
అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటేడ్ ల్యాబ్ ఎమినిటీస్ కాంప్లెక్స్)లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ప్రభుత్వం లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసింది. ఇవికాకుండా రాజమండ్రి, నెల్లూరులో కొత్తగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఐదు పట్టణాల్లో కాకుండా మరో 20 పట్టణాలు, మున్సిపల్ ఏరియాల్లో అడ్డాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణం, నిర్వహణను పీపీపీకి అప్పగించాలని నిర్ణయిస్తూ, టెండర్లు ఆహ్వనించేందుకు సిద్ధమైంది. దీనిపై కార్మిక శాఖ కమిషనర్, లేబర్ బోర్డు సీఈవో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.