ఏపీ పీజీఈ సెట్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 15 , 2026 | 04:53 AM
ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో (ఎంటెక్, ఎంఫార్మసీ) పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్..
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో (ఎంటెక్, ఎంఫార్మసీ) పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీఈసీఈటీ-2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ గురువారం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9,990 మంది పరీక్ష రాయగా, 9,320 మంది (93.29 శాతం) అర్హత సాధించారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.