Share News

పైలట్‌ ప్రాజెక్టుగా ప్రజా పంపిణీకి స్టీమ్డ్‌ రైస్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:29 AM

ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్డ్‌ రైస్‌ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు తుది దశలో ఉన్నాయని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు

పైలట్‌ ప్రాజెక్టుగా ప్రజా పంపిణీకి స్టీమ్డ్‌ రైస్‌

  • పాఠశాలల్లో భోజన పథకానికి పాత బియ్యం: మనోహర్‌

మంగళగిరి సిటీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్డ్‌ రైస్‌ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు తుది దశలో ఉన్నాయని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలో ఉన్న అక్షయపాత్ర కేంద్రీకృత వంటశాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్డ్‌ రైస్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ముందుగా ఒక జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి వచ్చే నెల నుంచి పాత బియ్యం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 05:30 AM