Share News

ర్యాంకుల ప్రచారంపై నిషేధాన్ని అమలు చేయండి

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:32 AM

మార్కులు, ర్యాంకులపై ప్రైవేటు విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు చేస్తున్న ప్రచారంపై నిషేధాన్ని అమలు చేయాలని ఏపీ పేరెంట్స్‌...

ర్యాంకుల ప్రచారంపై నిషేధాన్ని అమలు చేయండి

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): మార్కులు, ర్యాంకులపై ప్రైవేటు విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు చేస్తున్న ప్రచారంపై నిషేధాన్ని అమలు చేయాలని ఏపీ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరహరి శిఖరం, జి.ఈశ్వరయ్య ఈమేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. విద్యార్థులను మానసిక వేధింపుల గురిచేసేలా ఏర్పాటు చేస్తున్న హోర్డింగులను 15 రోజుల్లో తొలగించాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాంకులు, మార్కులపై ప్రచారం చేసుకుంటున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 04:32 AM