Share News

మా ఉద్యోగాలు తొలగించొద్దు

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:55 AM

గత పదేళ్లకు పైగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను తొలగించవద్దం టూ తాడేపల్లి గిరిజన గురుకుల సొసైటీ కార్యాలయం వద్ద ఔట్‌సోర్సింగ్‌ టీచర్లు ధర్నా చేపట్టారు.

మా ఉద్యోగాలు తొలగించొద్దు

  • గిరిజన గురుకుల సొసైటీ వద్ద ఔట్‌సోర్సింగ్‌ టీచర్ల ధర్నా .. పలువురి అరెస్టు

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): గత పదేళ్లకు పైగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను తొలగించవద్దం టూ తాడేపల్లి గిరిజన గురుకుల సొసైటీ కార్యాలయం వద్ద ఔట్‌సోర్సింగ్‌ టీచర్లు ధర్నా చేపట్టారు. వీరిలో పలువురిని సోమవారం అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఉద్యోగాలనే నమ్ముకుని జీవిస్తున్నామని, 40-50 ఏళ్ల వయసులో తమను ఇప్పుడు తొలగి స్తే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిశామని, ఉద్యోగాలు తొలగించబోమని ఆమె హామీ ఇ చ్చారని, అయితే ఇంకా 450 మందికి ఆర్థికశాఖ అనుమతి ఇవ్వకపోవడంతో తొలగిస్తున్నారని తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో మహిళా టీచర్లను వదిలేసి మిగిలిన వారిని పోలీసులు అరెస్టు చేసి తాడేపల్లి స్టేషన్‌కు తరలించారు. కాగా, గిరిజన సంక్షేమశాఖలోని గురుకుల పాఠశాలల్లో డీ ఎ స్సీ ద్వారా రెగ్యులర్‌ టీచర్‌ పోస్టులు భర్తీ చేయడంతో సుమా రు 1450 మంది ఔట్‌సోర్సింగ్‌ టీచర్లు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ టీచర్లకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని మంత్రి సంధ్యారాణి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సీనియర్‌ టీచర్లను ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేయగా.. 450 పోస్టులు భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, కస్తూర్బా విద్యాలయాల్లో ఇటీవల మరో 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారని, అలాంటి పోస్టుల్లో తమను సర్దుబాటు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 14 , 2026 | 04:56 AM