Share News

మున్సిపాలిటీల్లో ఫ్రెష్‌ వేస్ట్‌ ప్లాంట్‌లు

ABN , Publish Date - May 23 , 2026 | 06:01 AM

పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తున్న....

మున్సిపాలిటీల్లో ఫ్రెష్‌ వేస్ట్‌ ప్లాంట్‌లు

  • జూన్‌ నెలాఖరులోగా ఏర్పాటు చేయాలి

  • వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్రారంభించాలి: మంత్రి నారాయణ

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్ల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్లు వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్‌ చేయడానికి ప్రభుత్వం ఫ్రెష్‌ వేస్ట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. జూన్‌ నెలాఖరులోపు ప్లాంట్ల ఏర్పాటు పనులు పూర్తిచేసి, వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ అనిల్‌కుమార్‌రెడ్డి, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 06:07 AM