Share News

392 వైద్యుల పోస్టులు భర్తీ

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:10 AM

జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగులు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది.

392 వైద్యుల పోస్టులు భర్తీ

  • వెబ్‌ ఆప్షన్లకు నేటితో ముగియనున్న గడువు

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగులు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. పోస్టుల భర్తీకి సంబంధించి పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారి ప్రవేశపెట్టిన వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని ఎన్‌హెచ్‌ఎంలోనూ అనుసరిస్తున్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించే 392 పోస్టుల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 173, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో ఎన్సీడీ క్లినిక్‌ నిర్వహణ అవసరాల కోసం 99 పోస్టులు, అలానే నవజాత శిశుల సంరక్షణ కేంద్రాలకు 70, న్యూట్రిషన్‌ రిహాబిలేషన్‌ సెంటర్ల కోసం 12, టెలీ మెడిసిన్‌ హబ్స్‌ కోసం 25, డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్ల కోసం 13 పోస్టులు ఉన్నాయి. ఈ కేటగిరిలోని పోస్టులన్నింటికీ అభ్యర్థులకు వెబ్‌ ఆప్షన్ల అవకాశం కల్పించారు. బుధవారంతో వెబ్‌ ఆప్షన్‌ల గడువు పూర్తి అవుతుంది. ఆ వెంటనే అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వనున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 05:11 AM