Share News

బ్యాంకు ఖాతాలను మార్చొద్దు

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:47 AM

జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు సహేతుకమైన కారణాలు లేకుండా బ్యాంకు ఖాతాలను మార్చుకోవద్దని ఆరోగ్యశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు ఒక ప్రకటన జారీ చేశారు.

బ్యాంకు ఖాతాలను మార్చొద్దు

  • ఆరోగ్యశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు

అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు సహేతుకమైన కారణాలు లేకుండా బ్యాంకు ఖాతాలను మార్చుకోవద్దని ఆరోగ్యశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది వేతనాలు డీబీటీ విధానంలో ఉద్యోగుల ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో నేరు గా జమ అవుతాయని తెలిపారు. కొందరు ఉద్యోగులు ఆధార్‌ సీడింగ్‌ పూర్తికాకముందే బ్యాంకు ఖాతాలను మార్చుకోవడంతో చెల్లింపుల ప్రక్రియలో సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీని వల్ల రూ.60 నుంచి 70 కోట్ల మేర బిల్లుల చెల్లింపులపై ప్రభావం కనిపిస్తోందని వివరించారు.

Updated Date - Aug 24 , 2026 | 05:48 AM