10 శాతం పెరిగిన నికర జీఎస్టీ వసూళ్లు
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:11 AM
మార్చిలో నికర జీఎస్టీ వసూళ్లు 9.97 శాతం మేర పెరిగాయని రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు ఏ బుధవారం ప్రకటించారు. 2025-26లో మొత్తం నికర జీఎస్టీ వసూళ్లు 6 శాతం పెరిగాయన్నారు.
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): మార్చిలో నికర జీఎస్టీ వసూళ్లు 9.97 శాతం మేర పెరిగాయని రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు ఏ బుధవారం ప్రకటించారు. 2025-26లో మొత్తం నికర జీఎస్టీ వసూళ్లు 6 శాతం పెరిగాయన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావం ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధ్యమైందని తెలిపారు. మార్చిలో నికర జీఎస్టీ రూ. 3,316 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.193 కోట్లు జీఎస్టీ పరిహారం రూపంలో వచ్చాయి. స్థూల జీఎస్టీ రూ.3,773 కోట్లు వసూలయ్యాయి. 2025 మార్చి కంటే 2026 మార్చిలో నికర జీఎస్టీ వసూళ్లు 9.97 శాతం పెరిగాయి. అర్హత లేని లేదా అధిక ఐజీఎస్టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లను గుర్తించి వాటిని వెనక్కి తీసుకోవడంపై దృష్టి సారించామని బాబు ఏ తెలిపారు.