ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:31 AM
రాష్ట్రంలో కనీస వేతన స్కేలుతో ఒప్పంద ప్రాతిపదికన సేవలందిస్తున్న (1998, 2008 డీఎస్సీలు) ఉపాధ్యాయులకు ఈ విద్యాసంవత్సరానికి స్థానాల..
రేపటికి పూర్తి చేయాలని డీఈవోలకు ఆదేశం
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కనీస వేతన స్కేలుతో ఒప్పంద ప్రాతిపదికన సేవలందిస్తున్న (1998, 2008 డీఎస్సీలు) ఉపాధ్యాయులకు ఈ విద్యాసంవత్సరానికి స్థానాల కేటాయింపు( ప్లేస్‌మెంట్స్) కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 22వ తేదీకల్లా ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని, 1998, 2008 డీఎస్సీ ఉపాఽధ్యాయులకు సీనియారిటీ ప్రకారం స్థానాలను కేటాయించాలని పాఠశాల విద్య డైరెక్టరు తమీమ్ అన్సారియా శనివారం విడుదల చేసిన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులు, అనధికారిక గైర్హాజరు లేదా సెలవులు పెట్టి నిర్దేశిత గడువు పూర్తయినా తిరిగి విధుల్లో చేరని అభ్యర్థులు ఈ ఏడాది పునరుద్ధరించడానికి అర్హులు కారని తెలిపారు. మిగిలినవారిని ఎలాంటి మార్పు లేకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు 11 నెలల కాలానికి (ఒక నెల విరామంతో) అదే స్థానాల్లో పునరుద్ధరించాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.