మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:31 AM
మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు.
అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. ఏప్రిల్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. మోడల్ స్కూళ్లు ఉన్న మండలాల్లోనే ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు 2014 సెప్టెంబరు 1 - 2016 ఆగస్టు 31 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2012 సెప్టెంబరు 1 - 2016 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. సంబంధిత జిల్లాల్లో వరుసగా 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో చదివి, 2025-26లో ఐదో తరగతి చదువుతూ ప్రమోషన్ పొంది ఉండాలని స్పష్టంచేశారు.