Share News

కొవిడ్‌ లాంటి విపత్తు రావచ్చు.. అప్రమత్తంగా ఉండండి

ABN , Publish Date - May 19 , 2026 | 05:23 AM

‘గల్ఫ్‌లో యుద్ధం కారణంగా తలెత్తిన పరిణామాలతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. కొవిడ్‌ లాంటి విపత్తు రావచ్చు’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు.

కొవిడ్‌ లాంటి విపత్తు రావచ్చు.. అప్రమత్తంగా ఉండండి

  • వైసీపీ దొంగ మాటలు నమ్మకండి: మంత్రి సత్యప్రసాద్‌

  • నెల్లూరులోని 40 ఏళ్లనాటి భూ సమస్యకు సీఎం పరిష్కారం

  • అదే బాటలో విశాఖలోని సమస్యనూ పరిష్కరిస్తున్నాం: మంత్రి నారాయణ

తిరుపతి, మే 18(ఆంధ్రజ్యోతి): ‘గల్ఫ్‌లో యుద్ధం కారణంగా తలెత్తిన పరిణామాలతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. కొవిడ్‌ లాంటి విపత్తు రావచ్చు’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లె భూముల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాల పంపిణీ సోమవారం తిరుపతిలో పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ‘యుద్ధం అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపిం ది. దిగుమతులు తగ్గించుకోవాలంటే పొదుపు పాటించాల్సిందే. కొవిడ్‌ వంటి విపత్తు రావచ్చు... రాకపోనూ వచ్చు. ఏది జరిగినా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారం రాష్ట్రానికి దిక్సూచిలాంటిది. ల్యాండ్‌ పూలింగ్‌కు చంద్రబాబు పునాదులు వేయడం వల్లే భూ సమస్యలను పరిష్కరించగలిగాం’ అని మంత్రి సత్యప్రసాద్‌ అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘శెట్టిపల్లె తరహా భూ సమస్యలు రాష్ట్రంలో పలుచోట్లు ఉన్నాయి. వీటిని ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం ద్వారా సెటిల్‌ చేస్తున్నాం. నా సొంత నియోజకవర్గంనెల్లూరులో కూడా 40 ఏళ్లుగా ఉన్న భూసమస్యను సీఎం పరిష్కరించారు. ఇదే విధానంలో విశాఖపట్నంలోని సమస్యనూ పరిష్కరిస్తున్నాం’ అని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 05:24 AM