జగన్.. విధ్వంసంపై శిక్షణ ఇస్తారు: కేశవ్
ABN , Publish Date - May 01 , 2026 | 04:27 AM
జగన్... విధ్వంసం గురించి శిక్షణ ఇస్తారు. ఆల్‌ఖైదా మాదిరిగా ఇస్తారు. లేకపోతే మెక్సికోలో మాదిరిగా అదేదో శిక్షణకు పంపుతారు.
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ‘జగన్... విధ్వంసం గురించి శిక్షణ ఇస్తారు. ఆల్‌ఖైదా మాదిరిగా ఇస్తారు. లేకపోతే మెక్సికోలో మాదిరిగా అదేదో శిక్షణకు పంపుతారు. చంద్రబాబు మంత్రులను పంపాల్సి వస్తే.. సింగపూర్ పంపుతారు. లేదా ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే అక్కడికి పంపి, విషయాలు తెలుసుకోమంటారు’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంత్రులు విశ్రాంతి తీసుకోవటానికి సింగపూర్ వెళ్లలేదని.. అక్కడి విధానాల అధ్యయనానికి వెళ్లారని స్పష్టం చేశారు. ‘సింగపూర్‌లో దిగిన గంటన్నరలోనే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్టడీ టూర్‌పై ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్టు ఇస్తారు. అందరూ కలసి మరో రిపోర్టు ఇస్తారు’ అని పేర్కొన్నారు.