సమీక్షలే కాదు.. కార్మికుల సమస్యలూ చూస్తా!
ABN , Publish Date - May 06 , 2026 | 04:30 AM
‘కేవలం సమీక్షలతో సరిపెట్టే వ్యక్తిని కాదు.. క్షేత్రస్థాయిలో సమస్యలనూ స్వయంగా చూస్తా. టన్నెల్ లోపల కార్మికుల కష్టాన్ని స్వయంగా తెలుసుకుంటా’ అని రాష్ట్ర జలవనరుల శాఖ...
ఇంటర్నెట్ డెస్క్: ‘కేవలం సమీక్షలతో సరిపెట్టే వ్యక్తిని కాదు.. క్షేత్రస్థాయిలో సమస్యలనూ స్వయంగా చూస్తా. టన్నెల్ లోపల కార్మికుల కష్టాన్ని స్వయంగా తెలుసుకుంటా’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ టన్నెల్లో కార్మికుల కష్టాన్ని స్వయంగా చూసేందుకు మంగళవారం రాత్రి ఆయన టన్నెల్‌లోకి వెళ్లారు. చీకటిగా ఉన్నా అక్కడక్కడ అమర్చి ఉన్న లైట్ల వెలుగులోనే ఆయన అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. ఐదు గాంట్రీల వద్ద ఉన్న కార్మికులు, మిషనరీలకు మధ్య సమన్వయం పెంచి పనుల లక్ష్యాన్ని తానే సూచిస్తానని తెలిపారు.
- ఆంధ్రజ్యోతి, మార్కాపురం/పెద్దదోర్నాల