రాష్ట్రానికి శ్రీరామరక్ష కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:16 AM
సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి శ్రీరామరక్ష. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించుకుందాం’ అని కర్నూలు జిల్లా...
గొడ్డలి పార్టీతో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిమ్మల
కర్నూలు, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి శ్రీరామరక్ష. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించుకుందాం’ అని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు నగరంలోని బైరెడ్డి ఫంక్షన్ హాల్‌లో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన జరిగింది. ‘కుట్రలు, కుతంత్రాలతో గొడ్డలి పార్టీ రాజకీయం చేస్తోంది. ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి. మంత్రి లోకేశ్ నాయకత్వంలో మెగా డీఎస్సీ-2024 ఎంతో పారదర్శకంగా, పకడ్బందిగా నిర్వహిస్తే, యువతలో కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారానికి తెర తీశారు. రాయలసీమలో ప్రాధాన్య క్రమంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి కరువు, వలసలు శాశ్వతంగా నివారించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం’ అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.