బురద చల్లడమే గొడ్డలి పార్టీ లక్ష్యం: మండిపల్లి
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:59 AM
గొడ్డలి పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక పోతోంది. అందుకే ఉద్దేశపూర్వకంగా రోజూ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై..
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక పోతోంది. అందుకే ఉద్దేశపూర్వకంగా రోజూ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తోంది’ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రావణ్ లాంటి సమాజ విధ్వంసకులు చేసిన వ్యాఖ్యలను జగన్ ఖండించాల్సిందిపోయి సమర్థిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.