నేడు ప్రధానితో లోకేశ్ భేటీ
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:47 AM
అమరావతికి చట్టబద్ధతపై బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి లోకేశ్ బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.
ఉపరాష్ట్రపతి, అమిత్‌షాతోనూ సమావేశం
నేడు రాజ్యసభలో బిల్లు ప్రక్రియ వీక్షణ
న్యూఢిల్లీ/అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): అమరావతికి చట్టబద్ధతపై బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి లోకేశ్ బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీని కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పక్ష నాయకులను కూడా కలుస్తారు. అలాగే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తోనూ లోకేశ్ భేటీ అవుతారు. ఇక ఏపీ పునర్వ్యస్థీకరణ సవరణ బిల్లు నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుండటంతో గ్యాలరీలో నుంచి బిల్లు ఆమోదం ప్రక్రియను వీక్షించనున్నారు. కాగా, బుధవారం లోక్‌సభలో ఏపీ పునర్వ్యస్థీకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సభ్యులకు పలు సూచనలు చేశారు.