Share News

కులం, మతం, ప్రాంతాల మధ్య జగన్‌ చిచ్చు

ABN , Publish Date - Jul 08 , 2026 | 03:55 AM

‘రాష్ట్రం ఏమైపోయినా, ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు. తన ఆలోచనే గెలవాలనే ధోరణితో జగన్‌, గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. జగన్‌వి మానసిక రోగి ఆలోచనలు’ అని మంత్రి..

కులం, మతం, ప్రాంతాల మధ్య జగన్‌ చిచ్చు

  • ప్రజాస్వామ్యం గురించి ప్రకాశ్‌రాజ్‌ మాకు చెప్పాల్సిన పనిలేదు: మంత్రి కొలుసు

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రం ఏమైపోయినా, ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు. తన ఆలోచనే గెలవాలనే ధోరణితో జగన్‌, గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. జగన్‌వి మానసిక రోగి ఆలోచనలు’ అని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జగన్‌ దళితుల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దళితులు అనే పదం ఆయనకు అధికారాన్ని సంపాధించిపెట్టే ఒక ఆయుధం మాత్రమే. జగన్‌ మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల మధ్య నిప్పు పెట్టారు. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి మావిగన్‌ అంటున్నారు. అధికారంలో ఉన్న నాయకుల్ని వ్యక్తిగతంగా తిట్టడానికి సోషల్‌ మీడియాను వాడుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాకు ప్రకాశ్‌రాజ్‌ చెప్పాల్సిన అవసరం లేదు.’ అని మంత్రి పార్థసారథి అన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 03:56 AM