Share News

దానయ్య కుటుంబానికి అండగా ఉంటాం: కొలుసు

ABN , Publish Date - Jul 23 , 2026 | 04:59 AM

‘గొడ్డలి పార్టీగా పేరొందిన వైసీపీ.. రాజకీయ వ్యవస్థనంతా క్రిమినల్స్‌తో నింపేసింది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధితుల కోసం మాట్లాడకుండా..

దానయ్య కుటుంబానికి అండగా ఉంటాం: కొలుసు

  • సొంతంగా రూ.5లక్షలు సాయం

పలాస, జూలై 22(ఆంధ్రజ్యోతి): ‘గొడ్డలి పార్టీగా పేరొందిన వైసీపీ.. రాజకీయ వ్యవస్థనంతా క్రిమినల్స్‌తో నింపేసింది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధితుల కోసం మాట్లాడకుండా.. దానికి కారకుడైన వారికి మద్దతు తెలిపేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉంది’ అని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. తన తండ్రి పేరిట ఉన్న స్వచ్ఛంద సంస్థ సహాయంతో రూ.5లక్షల నగదును మృతుడి భార్య ద్రౌపదికి అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బెందాళం అశోక్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 05:01 AM