Share News

త్వరలో 625 ఏఈ పోస్టులు భర్తీ

ABN , Publish Date - May 22 , 2026 | 06:08 AM

విద్యుత్‌ శాఖలోని 625 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడించారు.

త్వరలో 625 ఏఈ పోస్టులు భర్తీ

  • రెండేళ్లలోనే 200 సబ్‌స్టేషన్‌లు నిర్మించాం: మంత్రి గొట్టిపాటి

మార్కాపురం, మే 21(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖలోని 625 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 200 సబ్‌స్టేషన్‌ల నిర్మాణం పూర్తిచేసినట్టు ఆయన తెలిపారు. గురువారం మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ఐటీవరంలో రూ.3.80 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. దోర్నాలలో నూతన బస్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన, చిన్నగుడిపాడులో సోలార్‌ విద్యుత్‌ ప్యానెళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘విద్యుత్‌ శాఖను బలోపేతం చేసేందుకు త్వరలోనే ఏఈ, లైన్‌మెన్‌ పోస్టులను భర్తీ చేస్తాం. కడపలో 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను త్వరలో మంత్రి లోకేశ్‌ ప్రారంభించనున్నారు. వైసీపీ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం 13 పైసలు ట్రూ డౌన్‌ చేసింది.‘ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.విజయ సునీత, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 06:08 AM