Share News

స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి ఆనంకు స్వల్ప అస్వస్థత

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:03 AM

తిరుపతిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి ఆనంకు స్వల్ప అస్వస్థత

తిరుపతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించాక ప్రసంగం ప్రారంభించారు. 18 పేజీలతో కూడిన బుక్‌లెట్‌లో ముద్రించిన ప్రసంగ పాఠాన్ని చదువుతుండగా 17వ పేజీ వద్ద తడబడ్డారు. పక్కనేవున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకుని కూర్చోబెట్టారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య సిబ్బంది అందించిన ప్రాథమిక చికిత్సతో కొద్దిసేపటికే కోలుకున్న మంత్రి యథావిధిగా వేడుకల్లో చివరి వరకూ పాల్గొన్నారు. ఆయన ప్రసంగ పాఠంలో చివరి రెండు పేజీలను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పూర్తి చేశారు. వేడుకల అనంతరం ఆనం నెల్లూరు బయల్దేరి వెళ్లారు.

Updated Date - Aug 16 , 2026 | 05:08 AM