Share News

మధ్యాహ్న భోజన పథకంపై ఐఐసీతో ఒప్పందం

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:35 AM

డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు పాఠశాల విద్యాశాఖ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ కార్ప్స్‌(ఐఐసీ)తో..

మధ్యాహ్న భోజన పథకంపై ఐఐసీతో ఒప్పందం

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు పాఠశాల విద్యాశాఖ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ కార్ప్స్‌(ఐఐసీ)తో ఒప్పందం చేసుకుంది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ సమక్షంలో గురువారం సచివాలయంలో ఈ ఒప్పందం జరిగింది. మధ్యాహ్న భోజన విభాగం డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు, ఐఐసీ ప్రతినిధులు రిషిక మోడీ, శ్రద్ధా శ్రీవాస్తవ, తుషార్‌ మల్హోత్రా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. డేటా అనలిటిక్స్‌, ఏఐ ద్వారా సాంకేతికతను మరింత మెరుగ్గా ఈ పథకంలో అమలుచేస్తారు. భోజనం తినే విద్యార్థుల సంఖ్య అంచనాలో కచ్చితత్వం తీసుకొస్తారు. అలాగే పోషకాహార ప్రమాణాలను ఆ కంపెనీ పర్యవేక్షిస్తుంది.

Updated Date - Feb 20 , 2026 | 04:35 AM